వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇటీవల సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ యూజర్లకు మరింత ఆకట్టుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా 1.5 బిలియన్ల మంది యూజర్లను ఎట్రాక్ట్ చేసేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను ఫేస్ బుక్ సొంత కంపెనీ ప్రవేశపెడుతూనే ఉంది. తాజాగా వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. ఒకేసారి ఎనిమిది మంది మాట్లాడుకునే అవకాశం కల్పించింది సంస్థ.

ఫేస్‌బుక్‌ అనుబంధ సంస్థయైన వాట్సాప్‌.. ప్రతిరోజు సరాసరిగా 15 బిలియన్ల నిమిషాల పాటు వీడియో ద్వారా మాట్లాడుతున్నారని తెలిపింది. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. లాక్ డౌన్ అమల్లో ఉంది. దీంతో వాయిస్‌, వీడియో కాలింగ్‌ చేసే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు డిజిటల్‌ ప్లాట్‌ఫాం కింద కలిసి మాట్లాడుకునే అవకాశం కల్పించడంలో భాగంగా వాట్సాప్ ఈ నూతన ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీంతో ఒకేసారి ఎనిమిది మంది వాయిస్‌ లేదా వీడియో కాల్‌ చేసుకునే అవకాశం కల్పించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story