తాజా వార్తలు

కరోనాను జయించిన 23 రోజుల చిన్నారి

కరోనాను జయించిన 23 రోజుల చిన్నారి
X

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తోంది. చిన్న పెద్దా తేడా లేకుండా అందరిపై ఈ మహమ్మారి తన ప్రభావం చూపుతోంది. తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో చాలమంది చిన్నారులు కరోనా బారిన పడి హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో 23రోజుల పసికందు కూడా ఉంది.

మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మర్కజ్‌కు వెళ్లి రావడంతో అతడికి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ క్రమంలో అతని 23 రోజుల కుమారుడికి విరేచనాలు కావడంతో నిలోఫర్‌కు తీసుకెళ్లారు. శిశువులో వైరస్‌ లక్షణాలు కనిపించకపోయినప్పటికీ తండ్రికి పాజిటివ్‌ ఉండటంతో తల్లీబిడ్డకు నిర్ధారణ పరీక్షలుచేశారు. తల్లికి నెగెటివ్‌ వచ్చింది. కాని చిన్నారికి మాత్రం పాజిటివ్‌గా తేలింది. దీంతో ఈ నెల 10న గాంధీ హాస్పిటల్ కి తరలించారు. 19 రోజులపాటు వైద్యులు మెరుగైన చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో ఆ 23 రోజుల చిన్నారి కోలుకోవడంతో గురువారం డిశ్చార్జిచేశారు. ఈ శిశువుతోపాటు మరో 13 మంది చిన్నారులు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

Next Story

RELATED STORIES