తెలంగాణలో మ‌రో మూడు రోజుల పాటు అకాల వ‌ర్షాలు

తెలంగాణలో మ‌రో మూడు రోజుల పాటు అకాల వ‌ర్షాలు

తెలంగాణలో మంగళవారం కురిసిన భారీ వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వడగళ్ల వానతో చేతికొచ్చిన పంట ధ్వంసమైంది. దాని నుంచి తేరుకోకముందే.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరో పిడుగులాంటి వార్త చెప్పింది. తెలంగాణలో రాగల మూడు రోజుల్లో అకాల వ‌ర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

దక్షిణ చత్తీస్‌గఢ్ మరియు పరిసర ప్రాంతాల్లో 1.5 కి.మీ. ఎత్తున ఉపరితల ఆవర్తన కొనసాగుతోందని అధికారులు తెలిపారు. నైరుతి మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు, పశ్చిమ విదర్భ, ఉత్తర మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడ, ఇంటీరియర్ కర్నాటక మీదుగా 0.9 ఎత్తున ఉపరిత ద్రోణి కొనసాగుతోందని వివరించారు. దీని వ‌ల్ల తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతవరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story