షాపుకెళ్లి సరుకులతో పాటు ఆమెనీ..

షాపుకెళ్లి సరుకులతో పాటు ఆమెనీ..
X

అమ్మకి తెలియకుండా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజులు ఆగి చెబుదాంలే అనుకున్నాడు. అమ్మాయిని వేరుగా ఉంచి అమ్మతో ఉంటున్నాడు. ఇంతలో లాక్ డౌన్ వచ్చి పడింది. అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి. ఓ రోజు అమ్మ షాపుకెళ్లి కూరగాయలు తెమ్మంది. ఇదే మంచి సమయమని భార్యనీ వెంటబెట్టుకుని వచ్చాడు. ఇదెక్కడి గోల అంటూ అమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లోని సహీదాబాద్‌కు చెందిన గుడ్డు రెండు నెలల క్రితం సవిత అనే యువతిని హరిద్వార్ ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో పెళ్లి విషయం చెప్పని గుడ్డు తన భార్యను ఢిల్లీలోని ఓ అద్దె ఇంట్లో ఉంచాడు. ఆ ఇంటి ఓనర్ ఆమెను ఇల్లు ఖాళీ చేయమనడంతో భార్యను ఇంటికి తీసుకురావాలనుకున్నాడు గుడ్డు. పచారీ కొట్టుకుకి తననూ రమ్మని చెప్పాడు. ఆమె వచ్చిన తరువాత ఇద్దరూ కలిసి ఇంటికి వచ్చారు.

కొడుకు పక్కన తలవంచుకుని నిలబడిన అమ్మాయిని చూసి ఎవరా అమ్మాయి అని కొడుకుని నిలదీసింది తల్లి. విషయం అంతా చెప్పేసరికి ఇంట్లోకి రానివ్వనంది. దాంతో పోలీసులు వచ్చి సర్ధి చెప్పారు. లాక్డౌన్ ముగిసే వరకు ఢిల్లీలో సవిత ఉన్న ఇంట్లోనే భార్యాభర్తలు ఉండేలా ఓనర్స్‌ని ఒప్పించి కథ సుఖాంతం చేశారు పోలీసులు.

Next Story

RELATED STORIES