వేడి వాతావరణం వైరస్‌ని చంపేస్తుంది.. కానీ..!!

సాధారణంగా వైరస్ సంబంధిత వ్యాధులు వేసవి కాలంలో రావు. ఎండకి తట్టుకోలేక, వడదెబ్బ తగిలి జనం అల్లాడి పోతుంటారు కానీ, జలుబు, జ్వరం, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు ఈ కాలంలో దరి చేరవు. కరోనా మనుగడ కూడా ఈ వేడి వాతావరణంలో కష్టమవుతున్నట్లు భారతీయ శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో గుర్తించారు. దేశంలోని వేడి వాతావరణం వైరస్ వ్యాప్తి నియంత్రణను రూపుమాపే అవకాశం ఉంటుందని తేల్చారు.
అయితే, వాతావరణ పరిస్థితుల కంటే భౌతిక దూరం పాటించడం, స్వీయ నియంత్రణ చర్యలే వైరస్‌పై పై చేయి సాధిస్తాయని వారు స్పష్టం చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, శ్రీనగర్, న్యూయార్క్‌ల్లోని వాతావరణ పరిస్థితులు.. వైరస్ వ్యాప్తి తీరును నాగ్‌పూర్‌లోని జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్ పరిశోధన ఇనిస్టిట్యూట్ (నీరి) శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో విశ్లేషించారు.
సాధారణంగా వైరస్‌లు వేడి ఉష్ణోగ్రతలను తట్టుకుని మనుగడ సాగించలేవని.. ఈ విధంగా చూస్తే కరోనా కూడ అదే కోవలోకి చెందుతుందని అంటున్నారు. అలా అని అశ్రద్ధ చేయడానికి వీలు లేదని స్పష్టం చేశారు. వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. ఈ ప్రణాళికలను పక్కాగా అమలు చేయడం వల్లనే కేరళలో వైరస్ నిర్మూలన సాధ్యమైందని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com