ముగ్గురు పోలీసులకు కరోనా

ముగ్గురు పోలీసులకు కరోనా

దేశంలో కరోనా మహమ్మారి విశ్వరూపం ప్రదర్శిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ మహమ్మారి తన ప్రతాపం చూపుతోంది. ఈ వైరస్ ని కట్టడి చేయడానికి కేంద్ర సర్కార్ లాక్ డౌన్ విధించి అమలు చేస్తోంది. అయితే లాక్‌డౌన్ డ్యూటీలో ఉన్న పోలీసులకు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. ప్రతి రోజు ప్రజలు రోడ్లపైకి రాకుండా కట్టడి చేస్తున్న వారిని కరోనా మహమ్మారి వెంటాడుతోంది.

తాజాగా కరోనా వైరస్‌ వ్యాప్తిని నిలువరించడంలో భాగంగా విధుల్లో ఉన్న ముగ్గురు పోలీసులకు కరోనా సోకింది. తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఎస్‌ఐలు, 25 ఏళ్ల కానిస్టేబుల్‌ ఈ వైరస్‌ బారిన పడ్డారు. ప్రస్తుతం వీరంతా వివిధ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు. తమిళనాడులో ఇప్పటివరకు 2,162 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 27 మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags

Read MoreRead Less
Next Story