మందుబాబులు మస్త్ ఖుషి.. సేల్స్‌కి గ్రీన్ సిగ్నల్

మందుబాబులు మస్త్ ఖుషి.. సేల్స్‌కి గ్రీన్ సిగ్నల్
X

లాక్‌డౌన్ నేపథ్యంలో మూతపడిన మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు మహారాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యవసరాల లిస్ట్‌లో మద్యం కూడా చేరిస్తేనే కదా మీకు ఆదాయం వచ్చేది మాకు నిద్ర పట్టేది. లాక్‌డౌన్ అని మద్యం దుకాణాలు కూడా మూసేస్తే మందు బాబులకు పిచ్చెక్కి ఆస్పత్రికి వెళ్లిన సందర్భాలు, మరెన్నో సిత్రాలు చూశాము. అన్నిటికీ మించి ప్రభుత్వ ఆదాయం పూర్తిగా పడిపోయింది. మీరు మళ్లీ కాస్త ఓ చుక్క ఎక్కువేస్తేనే కానీ మేం పైకి లేవమంటూ మహారాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరవాలనుకుంటోంది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే మందు బాబులు దుకాణానికి వెళ్లినప్పుడు కచ్చితంగా సామాజిక దూరం పాటించాలి, మాస్కులు ధరించాలి అని రూల్ పెట్టారు. రెండో విడత లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ.. దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్ మే3వ తారీఖుతో ముగియనున్నందున ప్రధాన మంత్రి మోదీ శనివారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.

Next Story

RELATED STORIES