లాక్‌డౌన్‌పై ప్రధాని మోదీ కీలక భేటీ

కరోనా వైరస్‌ కట్టడికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ మే 3తో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా.. లేదంటే ఆంక్షలను ఇంకా ఎక్కువగా సడలిస్తారా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే రేపు (శనివారం) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారని ప్రధాని కార్యాలయం ప్రకటించింది.

ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీతో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, పీయుష్‌ గోయల్‌తో పాటు కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గాబా, సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ ‌భేటీ అయ్యారు. విమానాలు , రైళ్లను పునప్రారంభించడం సమావేశం యొక్క ప్రధాన అజెండాల్లో ఒకటిగా తెలుస్తోంది. సోమవారం నుండి అనేక జిల్లాలకు గణనీయమైన సడలింపులు ఉంటాయని హోం మంత్రిత్వ శాఖ సూచించింది, అయితే "రెడ్ జోన్" లేదా COVID-19 బారిన పడిన ప్రాంతాలలో ఆంక్షలు కొనసాగుతాయని అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story