బ్రేకింగ్.. ఇండియా ఫుట్ బాల్ మాజీ కెప్టెన్ మృతి

X
TV5 Telugu30 April 2020 10:05 PM GMT
భారత దిగ్గజ ఫుట్‌బాల్ క్రీడాకారుడు, మాజీ కెప్టెన్ చుని గోస్వామి గురువారం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 82 ఏళ్ల గోస్వామి.. చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం 5 గంటలకి తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
1962 ఆసియా గేమ్స్‌లో భారత్ ఫుట్‌బాల్ జట్టుకి నాయకత్వం వహించిన గోస్వామి.. దేశానికి గోల్డ్‌మెడల్ అందించారు. గోస్వామి 1956 నుండి 1964 వరకు ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా భారతదేశం తరపున 50 మ్యాచ్‌లు ఆడారు. ఫుట్‌బాల్‌తో పాటు క్రికెట్‌లోనూ చుని గోస్వామికి ప్రావీణ్యం ఉంది. బెంగాల్ టీమ్ తరఫున క్రికెటర్‌గా 1962-73 మధ్యకాలంలో ఏకంగా 46 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లను అతను ఆడారు.
Next Story