తాజా వార్తలు

20 మంది కుటుంబసభ్యులు, స్నేహితుల మధ్య రిషి కపూర్ అంత్యక్రియలు

20 మంది కుటుంబసభ్యులు, స్నేహితుల మధ్య రిషి కపూర్ అంత్యక్రియలు
X

దేశవ్యాప్తంగా లాక్డౌన్ మధ్య సాయంత్రం 4 గంటలకు ముంబైలోని చందన్వాడి శ్మశానవాటికలో రిషి కపూర్ దహన సంస్కారాలు జరిగాయి. ఆయన కుమారుడు రణబీర్ కపూర్ తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. రిషి కపూర్ మృతదేహాన్నీ నేరుగా హెచ్ఎన్ రిలయన్స్ హాస్పిటల్ నుండి ముంబైలోని మెరైన్ లైన్స్ లోని చందన్వాడి శ్మశానవాటికకు తీసుకువచ్చారు,అక్కడికి కుటుంబ సభ్యులు కొద్దిమంది మాత్రమే వచ్చారు.

దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా 20 మందిని మాత్రమే అంత్యక్రియల హాజరుకు పరిమితం చేసింది. ఈ జాబితాలో రిషి కపూర్ భార్య నీతు కపూర్, సోదరి రిమా జైన్, మనోజ్ జైన్, అర్మాన్ జైన్, ఆధార్ జైన్, అనిషా జైన్, రాజీవ్ కపూర్, రణధీర్ కపూర్, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, అభిషేక్ బచ్చన్, అలియా భట్, డాక్టర్ తరంగ్, అయాన్ ముఖర్జీ , జై రామ్, రోహిత్ ధావన్, రాహుల్ రావైల్. అలియా మాత్రమే వచ్చారు.

Next Story

RELATED STORIES