రష్యా ప్రధానికి కరోనావైరస్ పాజిటివ్

రష్యా ప్రధానికి కరోనావైరస్ పాజిటివ్

రష్యా ప్రధాని మిఖాయిల్ మిషుస్టిన్ కు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది, ఈ విషయాన్నీ ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. ప్రస్తుతం తాను ఒంటరిగా ఉంటానని చెప్పారు. మొదటి ఉప ప్రధాని ఆండ్రీ బెలౌసోవ్ తాత్కాలికంగా మిషుస్టిన్ విధులను నిర్వర్తిస్తారని, అయితే ముఖ్య విషయాలపై తాను జోక్యం చేసుకుంటానని ప్రధాని గురువారం చెప్పారు. 54 ఏళ్ల మిషస్టిన్ జనవరిలో ప్రధానిగా ఎంపికయ్యారు. వైరస్ మహమ్మారితో బాధపడుతున్న రష్యా ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దడానికి విధానాలను రూపొందించడంలో మిషుస్టిన్ పాల్గొంటారని ఒక వీడియో కాల్ సందర్భంగా పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

రష్యాలో, ప్రధాని ఆర్థిక వ్యవస్థను పర్యవేక్షించడమే కాకుండా అధ్యక్షుడికి సహాయంగా ఉంటున్నారు. ప్రభుత్వ పరిపాలన మొత్తం పుతిన్ చేతుల మీదుగానే జరుగుతుంది. పుతిన్ చివరిసారిగా మిషస్టిన్‌తో భేటీ అయినప్పుడు ఆయనలో వైరస్ లక్షణాలు కనిపించలేదు. దాంతో తాజాగా పాజిటివ్ అని తేలడంతో సెల్ఫ్ ఐసోలేషన్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story