సెంట్రల్ విస్టా ఆపాల్సిన అవసరం లేదు : సుప్రీంకోర్టు

సెంట్రల్ విస్టా ఆపాల్సిన అవసరం లేదు : సుప్రీంకోర్టు
X

కేంద్ర ప్రభుత్వం రూ .20 వేల కోట్ల సెంట్రల్ విస్టా ప్రాజెక్టును నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ ప్రాజెక్టు కింద పార్లమెంటు ఉభయ సభలకు ఎక్కువ మంది సభ్యుల సామర్థ్యం ఉన్న కొత్త భవనాలు నిర్మించబడతాయి. అలాగే కేంద్ర సచివాలయానికి గాను కొత్తగా 10 భవనాలు నిర్మించనున్నారు. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణం ఆపాల్సిందిగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ ప్రాజెక్టుపై స్టే ఇవ్వాలని కోరుతూ న్యాయవాది రాజీవ్ సూరి పిటిషన్ వేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఐ బొబ్డే ధర్మాసనం గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరిపి స్టే ఇవ్వడానికి నిరాకరించారు. ప్రాజెక్టును ఆపాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.

Next Story

RELATED STORIES