కరోనావైరస్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

కరోనావైరస్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
X

కరోనావైరస్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైరస్ కు వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయాలజీతో సంబంధం ఉందిని..అది అక్కడే తయారైందని తమకు ఖచ్చితమైన సమాచారం ఉందని పేర్కొన్నారు. చైనా కరోనా విషయంలో ఖచ్చితమైన సమాచారం ఇవ్వలేదని అన్నారు. కాగా ప్రపంచంలో కరోనా వల్ల అమెరికా ఎక్కువగా ప్రభావితమవుతుంది.

ఇక్కడ 10 లక్షలకు పైగా ప్రజలు మహమ్మారి బారిన పడ్డారు.. 62 వేలకు పైగా మరణాలు సంభవించాయి. చైనా యొక్క వన్యప్రాణి మార్కెట్ నుండి కరోనా ఉద్భవించిందన్న చైనా వాదనను అమెరికా గతంలో ఖండించిన సంగతి తెలిసిందే. కాగా ప్రపంచంలో ఇప్పటివరకు 33 లక్షల 8 వేల 231 మందికి కరోనా సోకింది. 2 లక్షల 34 వేల 105 మరణాలు సంభవించగా, 10 లక్షల 39 వేల 195 మందికి నయమైంది.

Tags

Next Story