ఉత్తర ప్రదేశ్‌లో కొత్తగా 89 కేసులు

ఉత్తర ప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అక్కడ గడిచిన 24 గంటల్లో 89 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం సోకిన రోగుల సంఖ్య 2230 కు పెరిగింది, ఇందులో 1113 మంది, తబ్లిఘి జమాత్ తో సంబంధం ఉన్నవారు. మరోవైపు ఆగ్రాలో కొత్తగా 46 కేసులు రావడంతో మొత్తం ఇప్పుడు ఆగ్రాలో 479 మంది తేలారు.

అలాగే కొత్తగా లక్నోలో ఏడుగురికి పాజిటివ్ రావడంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 218 కి పెరిగింది. ఇక నమోదైన కేసులలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 43 మంది మరణించారు.. ఇక ఇప్పటివరకు 551 మంది రోగులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇంకా 1630 క్రియాశీలక కేసులు ఉన్నాయి.

Next Story

RELATED STORIES