మహారాష్ట్రలో ఆ ఒక్క జిల్లాలోనే వంద కరోనా మరణాలు

మహారాష్ట్రలో ఆ ఒక్క జిల్లాలోనే వంద కరోనా మరణాలు
X

కరోనా వైరస్ కేసులు దేశంలో విజృంభిస్తోంది. ఇక మహారాష్ట్రలో ఈ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో కేసుల సంఖ్య భయాందోళనలు కలిగిస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరిపై తన ప్రభావాన్ని చూపుతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. మహారాష్ట్రలో ఇప్పటివరకు 11,506 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాణాంతకర వైరస్ కారణంగా 485 మంది మృతి చెందారు.

రాష్ట్రంలో ముంబై తర్వాత కరోనా వైరస్‌తో అత్యంత ప్రభావితమైన జిల్లా పుణె. పుణెలో కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. శనివారం ఉదయం 68 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మృతి చెందాడు. దీంతో పుణెలో కరోనా మృతుల సంఖ్య వందకు చేరింది. అదేవిధంగా కొత్తగా 13 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1828 కి చేరింది. ఇక జిల్లాలోని ససూన్‌ జనరల్‌ హాస్పిటల్‌లో అత్యధికంగా 62 మంది కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు.

Next Story

RELATED STORIES