మహారాష్ట్ర సీఎం భద్రతా సిబ్బందిలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌

మహారాష్ట్ర సీఎం భద్రతా సిబ్బందిలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌
X

దేశవ్యాప్తంగా కరోనా కలకలం పెరుగుతోంది. లాక్‌డౌన్‌ కఠినంగా అమలవుతున్నప్పటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. ఇక్కడ సామాన్యులతోపాటు భద్రతాసిబ్బంది, వైద్యులు కూడా కొవిడ్‌ బారిన పడుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11506కి చేరింది. ఈ మహమ్మారి బారిన పడి 485 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే నివాసం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ముగ్గరు కానిస్టేబుళ్లకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో బాధితులను ఆస్పత్రికి తరలించి వారి కుటుంబసభ్యులను క్వారంటైన్‌లో ఉంచారు.

Next Story

RELATED STORIES