లాక్‌డౌన్ ఎత్తివేసినా విమానం ఎగరాలంటే..

లాక్‌డౌన్ ఎత్తివేసినా విమానం ఎగరాలంటే..
X

కోవిడ్ మహమ్మారి అన్ని రంగాలను ఆర్థిక సంక్షోభంలో పడేసింది. ముఖ్యంగా విమానయాన రంగం పరిస్థితి మరింత దారుణంగా ఉంది. లాక్డౌన్ మరో రెండు వారాలు పొడిగించడం మరింత దెబ్బ. ఒకవేళ లాక్డౌన్ ఎత్తివేసినా ఇప్పుడప్పుడే విమానాలు నడిపే పరిస్థితిలో లేవు. ఒక్క ఇండిగో సంస్థ ఆర్ధిక పరిస్థితి మెరుగ్గానే ఉన్నా మిగిలిన ఎయిర్‌లైన్స్ పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. ఈ సంస్థల విమానాలు మళ్లీ తమ విధులను ప్రారంభించాలంటే వెంటనే రూ.19,000 కోట్లు అవసరమని విమానయాన కన్సల్టెన్సీ సంస్థ కాపా ఇండియా తన తాజా నివేదికలో పేర్కొంది. ఇదే పరిస్థిత కొనసాగితే ఇండిగోకు కష్టాలు తప్పవంటోంది.

లాక్డౌన్ ముగిసినా కరోనా వ్యాప్తి నిరోధంలో భాగంగా సామాజిక దూరాన్ని కచ్చితంగా పాటించాలి. అలా అయినప్పుడు 180 సీట్లున్న విమానంలో 108కి మించి తీసుకెళ్లకూడదు. టికెట్ చార్జీలు పెంచితే అంత మంది ప్రయాణీకులను తీసుకువెళ్లినా ఉపయోగం ఉంటుంది. కరోనా, లాక్డౌన్ వీటన్నింటి నేపథ్యంలో ఇప్పటికే ఈ ఏడాది ప్రయాణీకుల రద్దీ 45 శాతం తగ్గింది. దాంతో దేశీయ విమానయాన సంస్థలు సుమారు రూ.85,120 కోట్ల నష్టాన్ని చవి చూస్తాయని అంచనా.

Next Story

RELATED STORIES