జమ్మూ కాశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

జమ్మూ కాశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
X

జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉన్న డేంజర్‌పోరాలో శనివారం ఉదయం ఎన్‌కౌంటర్‌ జరిగింది.. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో దాంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంకా ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో దాక్కున్నట్టు భావిస్తున్నారు. డేంజర్‌పోరా ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా దళాలు సమాచారం అందుకున్నాయి.

అనంతరం భద్రతా సిబ్బంది సెర్చ్ ఆపరేషన్లు చేస్తుండగా, వారిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భారత దళాలు ఎన్‌కౌంటర్ చేసి ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఈ విషయాన్నీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోన్నట్టు తెలుస్తోంది.

Next Story

RELATED STORIES