బిర్యానీ అమ్మి ఐసీయూలో.. 32 మంది క్వారంటైన్‌‌లో..

బిర్యానీ అమ్మి ఐసీయూలో.. 32 మంది క్వారంటైన్‌‌లో..

కరోనా ఏ రూపంలో అంటుకుంటుందో చెప్పడం కష్టమవుతోంది ప్రస్తుత పరిస్థితుల్లో. చాయ్ తాగిన వ్యక్తి ద్వారానో, పేకాట ఆడితేనో కరోనా వచ్చేస్తుంది. తాజాగా యూపీ మీరట్‌కు చెందిన ఓ వ్యక్తి లాక్‌డౌన్ సమయంలో బిర్యానీ అమ్మకాలు సాగించాడు. ఎవరింట్లో వారు వండుకోని తినండని లాక్‌డౌన్ విధిస్తే బిర్యానీ ఘుమఘుమలు వీధంతా గుప్పుమనేసరికి ఆర్డర్లు వస్తున్నాయి కదా అని అమ్మకాలు సాగించాడు. ఇంతలో అనారోగ్యం చేసి బిర్యానీ అమ్మకాలకు ఫుల్‌స్టాప్ పెట్టాడు. ఆస్పత్రికి వెళ్లి టెస్ట్ చేయించుకుంటే కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో అతడి దగ్గర బిర్యానీ కొన్న వ్యక్తుల వివరాలు సేకరిస్తే దాదాపు 32 మంది వరకు లెక్కతేలారు. దాంతో వారందరినీ క్వారంటైన్‌కు తరలించారు. బిర్యానీ విక్రేత ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story