Top

ఎంత పొగరు.. కారుని అడ్డుకున్న పోలీస్‌ అధికారిని ఈడ్చుకుంటూ..

ఎంత పొగరు.. కారుని అడ్డుకున్న పోలీస్‌ అధికారిని ఈడ్చుకుంటూ..
X

డ్యూటీలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపై చేయి చేసుకున్న ఘటనలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో తాజాగా మరో ఘటన జలంధర్‌ మిల్క్‌బార్‌లో చోటు చేసుకుంది. దేశమంతా లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో ఓ యువకుడు కారు తీసి రయ్ మంటూ రోడ్డు మీద దూసుకుపోతున్నాడు. డ్యూటీలో ఉన్న పోలీసు అతడిని అడ్డుకొని విచారించే ప్రయత్నం చేశాడు. కానీ కారులో ఉన్న యువకుడు ఏ మాత్రం పట్టనట్టు అడ్డుకున్న పోలీస్ అధికారిని బ్యానెట్‌పై ఎక్కించుకుని దూసుకుపోయాడు.

ఎక్కడికి వెళ్తున్నావు.. పత్రాలు ఏవీ చూపించు అని అడిగినందుకు ఆ యువకుడికి కోపం వచ్చి పోలీస్ అధికారి ముల్క్ రాజ్ అడిగినదానికి సమాధానం చెప్పకుండా కారు స్పీడ్ పెంచాడు. కారు బోనెట్ పట్టుకున్న ఏఎస్‌ఐ బోనెట్ మీద అలాగే ఉండిపోయారు. ఇది గమనించిన స్థానికులు, పోలీసులు, అటుగా వెళుతున్న వాహనదారులు కారుని వెంబడించి ఆపారు. దాంతో పోలీస్ అధికారి ప్రాణాలతో బయటపడ్డారు. కారులో ప్రయాణిస్తున్న యువకుడిని బయటకు దించి నాలుగు చీవాట్లు పెట్టి స్టేషన్‌కు తీసుకు వెళ్లారు పోలీసులు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

RELATED STORIES