తాజా వార్తలు

తెలంగాణలో మూడు రోజులపాటు వానలు పడే అవకాశం!

తెలంగాణలో మూడు రోజులపాటు వానలు పడే అవకాశం!
X

తెలంగాణలో వర్షాలు పడనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో మరో మూడు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా వానలు పడే అవకాశం ఉంది. దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంవల్ల దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా 4.5 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అల్ప‌పీడ‌నం రాగ‌ల‌ 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఫలితంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Next Story

RELATED STORIES