Top

పాక్ మరో దుశ్చర్య.. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించి..

పాక్ మరో దుశ్చర్య.. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించి..
X

నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నా పాకిస్తాన్ మాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. తాజాగా పాకిస్థాన్ దొంగదెబ్బకు ఇద్దరు భారత భద్రతా సిబ్బంది బలయ్యారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా రాంపూర్ సెక్టార్లో శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కాల్పుల విరమణ ఉల్లంఘన జరిగిందని వార్తా సంస్థ ANI నివేదించింది. కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ సైన్యం శుక్రవారం భారీ కాల్పులు జరిపింది. ఇందులో ఇద్దరు బాలికలు సహా పలువురు గాయపడ్డారు. దురదృష్టవశాత్తు ఇద్దరు జవాన్లు చికిత్స పొందుతూ మరణించారు.

Next Story

RELATED STORIES