కరోనా యోధులకు గౌరవ సత్కారం

కరోనా యోధులకు గౌరవ సత్కారం
X

కరోనాపై పోరాటంలో కృషి చేస్తోన్న ఆరోగ్య కార్యకర్తలు, ఇతర కరోనా యోధులను సత్కరించడానికి సాయుధ దళాలు చేస్తున్న మెగా ప్రయత్నం దేశవ్యాప్తంగా జరుగుతోంది, ఆదివారం దేశవ్యాప్తంగా కోవిడ్‌ ఆసుపత్రులపై వాయుసేన పూలవర్షం కురిపించింది. వైద్య మరియు ఇతర సిబ్బందికి సంఘీభావంగా సాయుధ దళాలు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కరోనా వైరస్‌ కట్టడి చేసేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది, పారామెడికల్‌ సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది ఇలా అందరూ అహర్నిశలు శ్రమిస్తున్నారు.

ఢిల్లీ, ముంబై, చెన్నై సహా వివిధ రాష్ట్రాల్లో ఉన్న పట్టణాల్లో కోవిడ్‌ ఆసుపత్రులపై వాయుసేన పూలవర్షం కురిపించింది. ఇక కోవిడ్ వారియర్స్‌కు సంఘీభావంగా ఆర్మీ మౌంటెయిన్ బ్యాండ్ మోగిస్తారు. అలాగే పోలీస్ స్మారకాల దగ్గర శ్రద్ధాంజలి ఘటిస్తారు. కరోనా కట్టడికి సేవలందిస్తున్న తెలంగాణలోని గాంధీ ఆసుపత్రి సిబ్బందికి వాయుసేన హెలికాప్టర్‌ ద్వారా పూలవర్షం కురిపిస్తూ తమ సంఘీభావం ప్రకటించారు.

Next Story

RELATED STORIES