135 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు కోవిడ్‌

135 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు కోవిడ్‌
X

ఢిల్లీలోని సెంట్రల్‌ రిజర్వు పోలీస్‌ ఫోర్స్ ‌(సీఆర్‌పీఎఫ్‌) కు చెందిన 135 మంది ట్రూపర్లకు కరోనావైరస్‌ పాజిటివ్‌ అని తేలింది. దాంతో ఢిల్లీలోని 31వ బెటాలియన్‌ లో ఈ వార్త కలకలం రేగింది. ఇప్పటివరకూ 135 మంది కరోనా భారిన పడ్డారని.. మరో 22 మంది సైనికుల నమూనాల ఫలితాలు రావాల్సివుందని, మిగిలినవి క్లియర్ అయ్యాయని అధికారులు శనివారం తెలిపారు. మరోవైపు నాలుగు వందల ఎనభై మంది సైనికులను ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్ కు తరలించారు.

రాజధానిలోని మయూర్‌విహార్‌ ప్రాంతంలో ఉండే ఈ బెటాలియన్‌లో సుమారు వెయ్యి మంది ఇందులో ఉంటారు.. దేశంలో ఇది అతిపెద్ద బెటాలియన్‌.. వీరికి వైరస్ ఎలా సోకిందనే విషయంపై అధికారులు ట్రేసింగ్ మొదలుపెట్టారు. ఇక ఇదే బెటాలియన్ కు చెందిన సబ్‌ ఇన్స్‌పెక్టర్‌(55) ఒకరు కరోనా వైరస్‌ కు బలైన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే వైరస్ పాజిటివ్ అని తేలిన వీరిలో చాలా మందికి లక్షణాలు లేకుండానే బయటపడింది.

Next Story

RELATED STORIES