ఢిల్లీలో సీఆర్పీఎఫ్‌ హెడ్‌ క్వార్టర్స్‌ మూసివేత

ఢిల్లీలో సీఆర్పీఎఫ్‌ హెడ్‌ క్వార్టర్స్‌ మూసివేత
X

సెంట్రల్‌ రిజర్వు పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌)లో కరోనా కలకలం రేగిన సంగతి తెలిసిందే. 130 మందికి పైగా ట్రూపర్లకు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా

బెటాలియన్ లో మిగిలిన సిబ్బందిని క్వారంటైన్ కు తరలించారు. మరోవైపు తాజాగా సీఆర్పీఎఫ్‌ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో హెడ్‌ క్వార్టర్స్‌ను అధికారులు ఆదివారం సీలు వేశారు.

శానిటేషన్‌ చేయడం కోసం ఢిల్లీలోని బెటాలియన్‌ కార్యాలయాన్ని క్లోజ్ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకూ భవనంలోకి ఎవరినీ అనుమతించేది లేదని అధికారులు తెలిపారు. కాగా ఢిల్లీలోని 31వ బెటాలియన్‌కు చెందిన 135 మంది ట్రూపర్లకు కరోనా సోకిగా.. దాదాపు 400 మందిని క్వారంటైన్ కు తరలించారు.

Next Story

RELATED STORIES