coronavirus : భారత్ లో మరోసారి పెరిగిన పాజిటివ్ కేసులు

coronavirus : భారత్ లో మరోసారి పెరిగిన పాజిటివ్ కేసులు
X

భారత్ లో కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకు పెరుగుతోంది. రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య ఉదృతం అవుతోంది. దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 39 వేల 242 కు పెరిగింది. శనివారం మహారాష్ట్రలో 790, గుజరాత్‌లో 333, ఉత్తరప్రదేశ్‌లో 159, పంజాబ్‌లో 187, మధ్యప్రదేశ్‌లో 73 సహా 1900 కి పైగా పాజిటివ్ కేసులు వచ్చాయి.

దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య covid19india.org , రాష్ట్ర ప్రభుత్వాల సమాచారం ప్రకారం 39,294 ఉండగా.. అందులో 10,566మందికి నయమైంది.. మొత్తం1223 మంది మరణించారు. అయితే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో గరిష్టంగా 1061 మంది ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రికవరీ రేటు 26.65% కి పెరిగింది. ప్రస్తుతం 37 వేల 776 మంది సోకినవారు ఉన్నారు. 26 వేల 535 మంది చికిత్స పొందుతున్నారు.

Tags

Next Story