ప్రపంచవ్యాప్తంగా 34 లక్షల మందికి పైగా కరోనా..

ప్రపంచవ్యాప్తంగా 34 లక్షల మందికి పైగా కరోనా..

ప్రపంచంలో 34 లక్షల 79 వేల 521 మంది కరోనా బారిన పడ్డారు. రెండు లక్షల 44 వేల 581 మంది మరణించగా, 11 లక్షల 8 వేల 23 మందికి నయం కావడంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇక యుఎస్‌లో 24 గంటల్లో సుమారు 1638 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు దేశంలో 67 వేలకు పైగా ప్రాణాలు కోల్పోయారు. కాలిఫోర్నియాలో స్టే-ఎట్-హోమ్ ఆదేశాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన 30 మందిని శనివారం అరెస్టు చేశారు. కరోనాకు పుట్టినిల్లు అయిన చైనాలో తాజాగా రెండు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే స్పెయిన్ లో మొత్తం కేసులు 2,45,567 కాగా ఇందులో 25.100 మంది మరణించారు. అలాగే 1,46,233 మంది కోలుకున్నారు..

మరోవైపు స్పెయిన్లో, సోమవారం నుండి ప్రజా రవాణాలో ముసుగులు ధరించడం తప్పనిసరి చేయబడింది. ఇక ఇటలీలో మొత్తం కేసులు 2,09,328 కాగా ఇందులో 28.710మంది మరణించారు. అలాగే 79914మంది కోలుకున్నారు. ఇక ఫ్రాన్స్ లో మొత్తం కేసులు 1,68,396 కాగా ఇందులో 24.760మంది మరణించారు. అలాగే 50562మంది కోలుకున్నారు.ఇరాన్ లో మొత్తం 97100 కేసులు నమోదు కాగా ఇందులో 6761మంది మరణించారు.. అలాగే 40937 మంది కోలుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story