వాయిదా పడ్డ ఎన్నికలపై వచ్చేవారం నిర్ణయం : ఈసీ

వాయిదా పడ్డ రాజ్యసభ, శాసన మండలి ఎన్నికల నిర్వహణపై వచ్చేవారంలో నిర్ణయం తీసుకోనున్నట్టు ఎన్నికల కమిషన్‌(ఈసీ) ప్రకటించింది. కోవిడ్‌–19 పరిస్థితులను సమీక్షించిన అనంతరం మార్చి 26 వాయిదాపడిన రాజ్యసభ ఎన్నికలపై కూడా నిర్ణయం తీసుకుంటామని అప్పట్లో చెప్పింది. అయితే వాయిదాను మరోసారి పొడిగించింది ఎన్నికల సంఘం. కాగా మార్చి 26న ఎగువ సభలోని 55 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, 37 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీలో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Next Story

RELATED STORIES