సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్ట్.. భారతీయుడిని జాబ్ నుంచి తొలగించిన కంపెనీ

సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్ట్.. భారతీయుడిని జాబ్ నుంచి తొలగించిన కంపెనీ

సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు, అసత్య ప్రచారాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా కొందరికి మాత్రం చెవికెక్కడం లేదు. పొరపాటు చేసి పీకల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఇస్లాంకు వ్యతిరేకంగా, తబ్లిగీ జమాత్ ను కించపరుస్తూ సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టాడు.. దీంతో అతన్ని ఉద్యోగం నుంచి తీసేశారు.. అంతేకాకుండా అతనిపై దేశ బహిష్కరణ వేటు కూడా వేశారు. ఈ ఘటన కువైట్ లో జరిగింది. కర్ణాటక రాష్ట్రం మంగళూరుకు చెందిన వ్యక్తి గత 20 ఏళ్లుగా కువైట్ లోని ఓ మల్టి నేషన్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అయితే అతను ఇటీవల భారత్ లో జరిగిన తబ్లిగీ జమాత్ ను కించపరుస్తూ పోస్టులు పెట్టాడు.

పైగా దానికి భారత్ లో కరోనా వ్యాప్తిగా తబ్లిగీలే కారణమంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో ఓ వర్గం ప్రజల ఆగ్రహానికి గురయ్యాడు. దాంతో ఈ విషయం అతను పనిచేస్తున్న సంస్థకు తెలిసింది. దాంతో అతన్ని ఉద్యోగం నుంచి తలగించింది. అంతేకాకుండా దీంతో 20 ఏళ్లుగా అక్కడే ఉద్యోగం చేస్తున్న అతన్ని దేశం విడిచి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే భారత్ విమానాలు ప్రారంభం అవగానే అతన్ని తిరిగి వెళ్లాల్సిందిగా కువైట్ ఆదేశించింది. కాగా ఇటీవల ఇస్లాంకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన చాలా మందిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇటీవల ఓ హోటల్ సూపర్ వైజర్ గా పని చేస్తున్న వ్యక్తిని కూడా ఉద్యోగం నుంచి తొలగించింది. మరో ఘటనలో ఫేస్ బుక్ లో ఇస్లాం వ్యతిరేక పోస్టు పెట్టిన మహిళను కూడా ఉద్యోగం నుంచి తొలగించారు.

Tags

Read MoreRead Less
Next Story