అంతర్జాతీయం

అమెరికాలో 30 మిలియన్లకు చేరిన నిరుద్యోగుల సంఖ్య..

అమెరికాలో 30 మిలియన్లకు చేరిన నిరుద్యోగుల సంఖ్య..
X

కరోనా మహమ్మారి అమెరికా ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. దాదాపుగా ప్రపంచదేశాలన్నీ ప్రభావితమైనా అగ్రరాజ్యం భారీ నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. రానున్న రోజులు ఆశాజనకంగా లేవు. నిరుద్యోగం భారీగా పెరుగుతోంది. అక్టోబరు-డిసెంబరు మధ్య కాలంలో 40 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే అధ్యక్షుడు ట్రంప్ ఇమిగ్రెంట్ వీసాలు ఆరునెలలపాటు నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం పోయిందని తెలుగు వారు ఆందోళన చెందవద్దని ఇమ్మిగ్రేషన్‌ శాఖలో పని చేస్తున్న ఓ అధికారి వివరించారు.

నిబంధనలకు విరుద్ధంగా హెచ్1బీ ఉద్యోగులను తొలగిస్తే నష్టపరిహారం పొందవచ్చన్నారు. ఉద్యోగం కోల్పోతే మాత్రం అమెరికా నిబంధనల ప్రకారం 60 రోజుల్లో స్వదేశానికి వెళ్లిపోవాలని అన్నారు. ఇంతకు ముందెన్నడూ లేనంతగా అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య 30 మిలియన్లకు చేరింది. ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం. ఉద్యోగం మళ్లీ పొందాలంటే మొదటి ప్రాధాన్యం అమెరికన్లకే ఉంటుంది. ఇప్పటికే చమురు, విమానాలు, క్రూయిజ్ రంగాల్లో ఉద్యోగులను తీసేసారు.

రానున్న రోజుల్లో సాప్ట్‌వేర్ ఉద్యోగులపై కూడా వేటు పడుతుంది. కొన్ని కంపెనీలు దివాలా తీసే పరిస్థితికి వచ్చాయి. నిత్యావసర వస్తువుల ధరలూ పెరుగుతాయి. సాధారణంగా టెంపరరీ ఉద్యోగాలకు గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు పోటీ పడతారు. ఇవి అమెరికేతరులు దక్కించుకుంటున్నారు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు వాటికి కూడా అమెరికన్ల నుంచే గట్టి పోటీ ఎదురువుతుంది. డిసెంబరులోగా కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోతే పరిస్థితులు మరింత దారుణంగా మారే అవకాశం ఉందని ఆయన అంటున్నారు.

Next Story

RELATED STORIES