దేశంలో మరో వైరస్ కలకలం.. 2500 పందులు మృతి

దేశంలో మరో వైరస్ కలకలం.. 2500 పందులు మృతి

ఒక వైపు భారత్‌లో కరోనా కరాళా నృత్యం చేస్తుంటే.. మరొవైపు ఓ వైరస్ ఆందోళన కల్గిస్తోంది. తాజాగా దేశంలో మరో ఫ్లూని అధికారులు గుర్తించారు. ఆఫ్రికా స్వైన్ ఫ్లూగా పిలిచే ఓ వైరస్... ఇప్పుడు తొలిసారిగా ఈశాన్య రాష్ట్రమైన అసోంలో పందులను చంపేస్తోంది. ఇప్పటికే ఇది 306 గ్రామాలకు పాకిందంటే.. అది ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసోంలో ఈ వైరస్‌ని గుర్తించినట్లు పసు సంవర్ధక శాఖ మంత్రి అతుల్ బోరా అధికారికంగా ప్రకటించారు.

అసోంలో ఆఫ్రికన్‌ స్వైన్‌ఫ్లూ వల్ల ఏడు జిల్లాల్లోని 306 గ్రామాల్లో సుమారు 2500 పందుల మృతి చెందాయి. భోపాల్‌లో మొదటి ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫ్లూ (ఏఎస్‌ఎఫ్‌) నమోదైనట్లు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హై సెక్యూరిటీ యానిమల్‌ డిసీసెస్‌ (ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీ) నిర్ధారించింది. 2019 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో పందుల జనాభా 21 లక్షలు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య సుమారు 30 లక్షలకు చేరింది.

పందులు, కోళ్లకు ఇలాంటి రకరకాల వైరస్‌లు అప్పుడప్పుడూ వస్తూనే ఉంటాయి. అవి మనుషులకు సోకే అవకాశాలు తక్కువే. కానీ.. దురదృష్టం వెంటాడితే.. కరోనా లాగా.. మనుషులకూ సోకే ప్రమాదం ఉంటుంది. అందుకే.. ఆఫ్రికా స్వైన్ ఫ్లూ వ్యవహారం ఇప్పుడు దేశంలో ఆందోళన కల్గిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story