ఇండియాలో 40వేలు దాటిన కరోనా కేసులు

X
By - TV5 Telugu |4 May 2020 3:08 AM IST
ఇండియాలో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 40వేలు దాటాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 2487 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి బారిన పడి గడచిన 24 గంటల్లో 83 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా మొత్తం కరోనా బాధితుల సంఖ్య 40,263కు చేరింది. ఈ ప్రాణాంతకర వైరస్ కారణంగా ఇప్పటి వరకు 1306 మంది మృతి చెందారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com