దేశంలో మరోసారి పెరిగిన కరోనా కేసులు

దేశంలో మరోసారి పెరిగిన కరోనా కేసులు
X

దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 42 వేల 786 కు పెరిగింది. ఒక్క మహారాష్ట్రలోనే 13,000 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇది దేశం మొత్తంలో 31% గా ఉంది. ఇక కొత్తగా మహారాష్ట్రలో 678, ఢిల్లీలో 427, గుజరాత్‌లో 374, పంజాబ్‌లో 330, ఉత్తర ప్రదేశ్‌లో 158, రాజస్థాన్‌లో 114, మధ్యప్రదేశ్‌లో 49 సహా 2676 నివేదికలు పాజిటివ్ గా వచ్చాయి ఉన్నాయి.

అయితే ఈ లెక్కలు covid19india.org , సమాచారం ప్రకారం ఉన్నాయి. అయితే కేంద్ర ఆరోగ్య శాఖ అధికారిక వెబ్ సైట్ ప్రకారం దేశంలో మొత్తం 42 వేల 537 మంది సోకినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఇందులో 11 వేల 706 మందికి నయమైందని, 1373 మంది మరణించారని. 29 వేల 453 మంది చికిత్సలో ఉన్నారని పేర్కొంది.

Next Story

RELATED STORIES