ఉద్యోగులకు వేతన చెల్లింపులపై చేతులెత్తేసిన గోఎయిర్‌

ఉద్యోగులకు వేతన చెల్లింపులపై చేతులెత్తేసిన గోఎయిర్‌

ప్రస్తుతం కరోనా సంక్షోభం కారణంగా ఉద్యోగులకు వేతనాలు అందించే పరిస్థితి లేదని గోఎయిర్‌ తమ ఉద్యోగులకు స్పష్టం చేసింది. వేతనాల విషయంలో గోఎయిర్‌ సీఎండీ నుస్లీ వాదియా, ఎండీ జే వాదియా ఉద్యోగులకు రాసిన లేఖలో.. తమ విమానయాన సంస్థ తన ఉద్యోగులందరికీ తక్షణ జీతాలు చెల్లించడానికి తగినంత డబ్బు లేదని పేర్కొన్నారు, కంపెనీకి ప్రభుత్వం నుంచి లేదా దేశ బ్యాంకింగ్ వ్యవస్థ నుండి సహాయం లభించలేదని అన్నారు.

లాక్‌డౌన్‌తో కారణంగా అన్ని దేశీయ, విదేశీయ విమానయాన సర్వీసులు నిలిచిపోవడంతో తమ ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకు సంస్థ సమస్యలు ఎదుర్కొంటున్నదని వివరించారు. మార్చి మరియు ఏప్రిల్ నెలల్లో వచ్చిన ఆదాయంతోనే జీతాలను చెల్లించడం మినహా కంపెనీకి "వేరే మార్గం లేదు" అని వారు చెప్పారు. అయినా కూడా మొత్తం ఉద్యోగులలో 40 శాతం (2,500) మందికి మాత్రమే పూర్తి జీతాలు చెల్లించగలిగినప్పటికీ, మిగిలిన ఉద్యోగులకు గ్రేడెడ్ లేదా వాయిదా ప్రాతిపదికన వేతనం ఇవ్వాలని భావిస్తోంది. గోఎయిర్‌ బోర్డు సభ్యులు, సీఎండీ సైతం వేతనాలు తీసుకోవడం లేదని లేఖ పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story