బలహీనపడిన రూపాయి.. పెరిగిన బంగారం ధర

బలహీనపడిన రూపాయి.. పెరిగిన బంగారం ధర
X

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మళ్ళీ బలపడటంతో 4 రోజుల వరుస ర్యాలీకి బ్రేక్‌పడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 75.71 వద్ద ప్రారంభమైంది. గత ట్రేడింగ్‌ సెషన్‌లో రూపాయి 75.10 వద్ద ముగిసింది. గత 4 రోజులుగా బలపడుతోన్న రూపాయి మళ్ళీ షరామామూలుగా బలహీనపడింది. ప్రస్తుతం 72 పైసలు బలహీనపడి 76.26 స్థాయి వద్ద రూపాయి ట్రేడవుతోంది.

మరోవైపు బంగారం, వెండి ధరలు సోమవారం స్వల్పంగా పెరిగాయి. జూన్‌ 5 కాంట్రాక్టులో బంగారం ధర 45,545 రూపాయలకు, వెండి ధర 41270కు చేరాయి. ఇక ఎంసీఎక్స్‌లో క్రూడాయిల్‌ ధర 5శాతం తగ్గింది.

Next Story

RELATED STORIES