రిలయెన్స్ జియోలో సిల్వర్‌ లేక్ భారీ పెట్టుబడులు

రిలయెన్స్ జియోలో సిల్వర్‌ లేక్ భారీ పెట్టుబడులు

జియో ప్లాట్‌ఫామ్స్‌లో అమెరికాకు చెందిన ప్రైవేట్‌ ఈక్విటీ మరో దిగ్గజ సంస్థ సిల్వర్‌ లేక్‌ భారీగా పెట్టుబడులు పెట్టనుంది. ఇటీవలే జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్‌బుక్‌ 9.99శాతం వాటాను రూ.43,574 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చకుంది. తాజాగా సిల్వర్‌ లేక్‌ కూడా ఒకశాతం వాటాను 750 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేయనుంది.

"రిలయన్స్‌ ప్లాట్‌ఫామ్స్‌లో సిల్వర్‌ లేక్‌ పెట్టుబడులు పెట్టడం ఎంతో సంతోషకరం. సిల్వర్ లేక్‌ను విలువైన భాగస్వామిగా స్వాగతిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ టెక్నాలజీ కంపెనీలకు సిల్వర్‌ లేక్‌ విలువైన భాగస్వామిగా ఉంది. ఇండియన్ డిజిటల్ సొసైటీ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం వారి ప్రపంచ సాంకేతిక సంబంధాల నుంచి మరింత ముందుకెళ్లేందుకు మే ప్రయత్నిస్తాం" అని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ అన్నారు.

భారతీయ మార్కెట్లో డిజిటలైజేషన్‌ ద్వారా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా చక్కని గుర్తింపు ఉన్న సిల్వర్‌లేక్‌లో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌ విలువ భారతీయ కరెన్సీలో రూ.5,656 కోట్లుగా ఉంది. భారత్‌లో సిల్వర్‌ లేక్‌కు ఇదే మొట్టమొదటి పెట్టుబడి కావడం విశేషం. గత నెల 22న ఫేస్‌బుక్‌తో కుదుర్చకున్న డీల్‌ కన్నా ఈ ఒప్పందం ప్రీమియం 12.5శాతం ఎక్కువగా ఉంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చెయిన్, ఏఆర్, వీఆర్, బిగ్ డేటా లాంటి ప్రపంచ స్థాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను, సామర్థ్యాలతో సిల్వర్‌లేక్‌ ఇప్పటికే ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది. ఎయిర్‌బీఎన్‌బీ, ఆలీబాబా, యాంట్ ఫైనాన్షియల్, ఆల్ఫాబెట్‌కు చెందిన వెరిలీ, డెల్ టెక్నాలజీస్, ట్విట్టర్ లాంటి కంపెనీల్లో సిల్వర్ లేక్ పెట్టుబడులు పెట్టింది.

Tags

Read MoreRead Less
Next Story