సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షలు వాయిదా..

సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షలు వాయిదా..
X

మూడో విడత లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. వాస్తవానికి ఈ పరీక్షలు ఈ నెల 31న జరగాల్సి ఉంది. మళ్లీ ఎప్పుడు పెట్టేదీ మే 20వ తేదీన వెల్లడిస్తామని ప్రకటించింది. మే 17వ తేదీ వరకు కొనసాగనున్న లాక్డౌన్ ఆ తరువాత కూడా పొడిగించేదీ లేందీ ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కరోనా వ్యాప్తి నిర్మూలనకు ఎన్ని చర్యలు చేపడుతున్నా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తుంది. కాగా, దేశంలో ఇప్పటి వరకు ఉన్న పాజిటివ్ కేసుల సంఖ్య 42,533 కాగా, 1372 మంది మరణించారు. 11,707 మంది కోలుకున్నారు.

Next Story

RELATED STORIES