ఇక మద్యాన్ని ఇంటికే సరఫరా చేస్తారు

ఇక మద్యాన్ని ఇంటికే సరఫరా చేస్తారు
X

ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాను కట్టడి చేసేందుకు తీసుకునే చర్యల్లో భాగంగా మద్యంను ఇంటికే సరఫరా చేసేందుకు నిర్ణయించింది. మూడో దశ లాక్ డౌన్ లో ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ఇందులో మద్యం దుకాణాలు కూడా తెరవడానికి అనుమతి ఇవ్వడంతో.. మందుబాబులు చెలరేగిపోయారు. సామాజిక దూరం కూడా పాటించకుండా షాప్ ల ముందు బారులు తీరారు. దీంతో.. పలు వర్గాల నుంచి ప్రభుత్వాలు విమర్శలు ఎదుర్కొంటున్నాయి. కరోనాకు వ్యతిరేకంగా 40 రోజుల నుంచి పోరాటం ఒక్క రోజులో నీరుగారిపోయింది. దీంతో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఛత్తీస్‌గఢ్‌ స్టేట్‌ మార్కెటింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ అధికారులు తెలిపారు. ప్రతి కస్టమర్‌ 5 వేల మిల్లిలీటర్ల మద్యం వరకు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేయొచ్చని అధికారులు సూచించారు. ఇంటి వద్ద మద్యాన్ని డెలివరీ చేసినప్పడు సర్వీస్‌ ఛార్జి కింద తప్పనిసరిగా రూ. 120 చెల్లించాలని అధికారులు చెప్పారు. సీఎస్‌ఎంసీఎల్‌ ఆన్‌లైన్‌ ఆప్‌ ద్వారా మద్యాన్ని ఆర్డర్‌ చేయొచ్చు. ఆర్డర్‌లో కాంటాక్ట్‌ నంబర్‌తో పాటు ఆధార్‌ నంబర్‌, అడ్రస్‌ను మెన్షన్‌ చేయాలి.

Next Story

RELATED STORIES