కార్మికుల చార్జీలను ప్రభుత్వమే భరిస్తుంది : చత్తీస్‌గఢ్ సీఎం

కార్మికుల చార్జీలను ప్రభుత్వమే భరిస్తుంది : చత్తీస్‌గఢ్ సీఎం

దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఈ ప్రాణాంతకర వైరస్ ని కట్టడి చేయడానికి ప్రభుత్వం లాక్ డౌన్ విధించి అమలు చేస్తోంది. ఈ లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు వర్ణనాతీతమైన కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఎక్కడిక్కడ చిక్కుకుపోయిన వీరు.. తమవారు ఎలా ఉన్నారో, వారిని ఎలా చేరుకోవాలో తేలీక బెంగతో తల్లడిల్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో వలస కూలీలను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది సర్కార్. అయితే శ్రామిక్ రైళ్లలో స్వస్థలాలకు వెళ్తున్న వలస కార్మికులకు ఛార్జీల చెల్లింపు వ్యవహారంపై దుమారం తలెత్తెంది.

ఈ నేపథ్యంలో తమ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు వేస్తే కార్మికుల చార్జీలను ప్రభుత్వమే భరిస్తుందని చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భగేల్ తెలిపారు. సీఎం సూచనలతో రాష్ట్ర రవాణాశాఖ కార్యదర్శి డాక్టర్ కమల్‌ప్రీత్ సింగ్.. రాయ్‌పూర్ డివిజనల్ మేనేజర్ అండ్ నోడల్ ఆఫీసర్ శ్యాంసుందర్ గుప్తాకు లేఖ రాశారు. చత్తీస్‌గఢ్ వలస కూలీలను వెనక్కి తీసుకొచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అందులో కోరారు. లాక్‌డౌన్‌ను పొడిగించిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాలలో చిక్కుకుపోయిన తమ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులను రైళ్ల ద్వారా వెనక్కి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story