మాంసం ప్రాసెసింగ్ యూనిట్ లో కరోనా కేసులు..

మాంసం ప్రాసెసింగ్ యూనిట్ లో కరోనా కేసులు..

కరోనా మహమ్మారి సంక్రమణకు మాంసం ప్రాసెసింగ్ యూనిట్ లు కూడా కారణమని ఆస్ట్రేలియాలో కొంతమంది నమ్ముతున్నారు. ఆస్ట్రేలియాలోని విక్టోరియా ప్రావిన్స్ దగ్గర ఉన్న మాంసం ప్రాసెసింగ్ యూనిటే కరోనా కేసులు పెరగడానికి కారణం అని అభిప్రాయపడుతున్నారు. అధికారులు కూడా సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. వారు చెప్పిన వివరాల ప్రకారం, కొత్తగా 22 సంక్రమణ కేసులు నమోదయితే. ఇందులో 19 మంది ప్రాసెసింగ్ యూనిట్ ఉద్యోగులు ఉన్నారు. ఈ ప్లాంట్ నుండి ఇంతకుముందు 15 కేసులు నమోదయ్యాయి.

దీంతో మాంసం ద్వారా కరోనా ఎక్కువగా ప్రభలుతుందని అనుకుంటున్నారు. మరోవైపు విక్టోరియా ప్రావిన్స్‌లో సోకిన వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆదివారం ఇక్కడ 13 వేల మందిని పరీక్షించామని తెలిపారు. కాగా ప్రస్తుతం ఆ రాష్ట్రంలో మొత్తం సోకిన వారి సంఖ్య 1406 కు పెరిగింది. అలాగే ఆస్ట్రేలియా దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు 6,825 ఉంటే ఇందులో 5,859 మంది కోలుకున్నారు. కేవలం 95 మంది మాత్రమే మరణించారు.

Tags

Read MoreRead Less
Next Story