డాక్టర్ డాగ్స్.. వాసన పసిగట్టేస్తాయి.. వైరస్‌ను గుర్తిస్తాయి

డాక్టర్ డాగ్స్.. వాసన పసిగట్టేస్తాయి.. వైరస్‌ను గుర్తిస్తాయి

విశ్వాసానికి మారు పేరు శునకరాజం. దొంగల్ని, పేలుడు పదార్థాల జాడల్నీ పసిగట్టే శునకాలు ఇప్పుడు కరోనా వైరస్ సోకిన వ్యక్తుల్ని గుర్తించడంలోనూ శిక్షణ తీసుకున్నాయి. అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన వెటర్నరీ మెడిసిన్ విభాగానికి చెందిన పరిశోధకులు శునకాల ద్వారా వైరస్‌ను గుర్తించే ప్రక్రియను చేపట్టారు. 1980లోనే శునకాలు క్యాన్సర్‌ను గుర్తించాయి. ఇప్పుడు కరోనా వైరస్ కారకాలను గుర్తించడానికి రెడీ అవుతున్నాయి. కరోనాను కనుగొనేందుకు నెగెటివ్, పాజిటివ్ నమూనాలను శునకాల చెంత ఉంచి వాసన చూపిస్తూ శిక్షణ ఇస్తున్నారు.

సాధారణంగా మనుషుల్లో 60 లక్షల వాసన గ్రాహకాలు ఉంటాయి. అదే శునకాల్లో అయితే 30 కోట్ల గ్రాహకాలు ఉంటాయి. అందుకే శునకాలు ఏం కొంచెం వాసనైనా ఇట్టే పసిగట్టేస్తాయి. వీటి ద్వారా బహిరంగ ప్రదేశాల్లో పెద్ద సంఖ్యలో ఉన్న ప్రజలను త్వరగా పరిక్షించడానికి సహాయపడుతుంది.

ప్రస్తుత అంటువ్యాధిని అదుపులోకి తెచ్చిన తరువాత వ్యాధి తిరిగి రాకుండా నిరోధించడానికి శునకాలు సహాయపడతాయని డర్హామ్ విశ్వవిద్యాలయంలోని పబ్లిక్ హెల్త్ కీటకాలజిస్ట్ స్టీవ్ లిండ్స్ జాతీయ మీడియాకు వివరించారు. ఒక్కో శునకం గంటకు 250 మందిని పరీక్షించగలదని విశ్వవిద్యాలయ పరిశోధకులు జేమ్స్ వివరించారు. శిక్షణ తీసుకున్న శునకాలు జులై కల్లా డ్యూటీలో జాయినైపోయి కరోనాను కట్టడి చేస్తాయని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story