విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాటు చేసిన విమాన సర్వీసుల షెడ్యూల్..

విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాటు చేసిన విమాన సర్వీసుల షెడ్యూల్..

లాక్డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన వేలాది మంది భారతీయులను తరలించడానికి ఏడు రోజుల పాటు భారత్ 64 విమానాలను నడుపుతుందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. మే 4 నాటి 'ఫ్లైట్ ప్లాన్ ఫర్ రిటర్న్ ఆఫ్ ఇండియన్ నేషనల్స్ స్టాండ్ అబ్రాడ్' ప్రకారం ఏడు రోజుల వ్యవధిలో 14,800 మంది ప్రయాణీకులను దేశంలోని వివిధ నగరాలకు చేరుస్తారు. ఒక్కో విమానంలో దాదాపు 200-300 మంది ప్రయాణికులు ఉంటారు. భారతీయ పౌరులను స్వదేశానికి తీసుకువచ్చే దేశాలలో యుఎఇ, సౌదీ అరేబియా, యునైటెడ్ కింగ్‌డమ్, యుఎస్ఎ, సింగపూర్, బంగ్లాదేశ్, ఖతార్, కువైట్ తదితర దేశాలు ఉన్నాయి. ఈ విమానాలలో ఎక్కువ భాగం ఎయిర్ ఇండియా నడుపుతుంది.

ప్రణాళిక ప్రకారం మొదటి రోజు.. 2,300 మంది భారతీయులను తీసుకురావడానికి 10 విమానాలు ఉపయోగిస్తారు. అవి అబుదాబి నుండి కొచ్చికి, దుబాయ్ నుండి కోజికోడ్ వరకు, లండన్ నుండి ముంబై వరకు.

2వ రోజు.. 2.050 మంది భారతీయులను తీసుకురావడానికి దుబాయ్ నుండి చెన్నై వరకు, మనమా నుండి కొచ్చి, కౌలాలంపూర్ నుండి ముంబై వరకు.

3వ రోజు.. మధ్య ప్రాచ్యం, యూరప్, సౌత్ ఈస్ట్ ఆసియా, యుఎస్ఎ లోని 13 దేశాల నుండి ముంబై, కొచ్చి, లక్నో, ఢిల్లీకి సుమారుగా 2 వేల మంది వచ్చే అవకాశం ఉంది.

4వ రోజు.. దోహా, త్రివేండ్రం, సింగపూర్, వాషింగ్టన్, మరియు అబుదాబిల నుంచి 1850 మంది భారతీయులు తరలిస్తారు.

5వ రోజు.. దమ్మం నుండి కొచ్చి, సింగపూర్, ఢిల్లీ, లండన్, అహ్మదాబాద్ వెళ్లే విమానాల్లో సుమారు 2,200 మంది భారతీయులను తరలిస్తారు.

6వ రోజు.. కొచ్చి, ఢిల్లీ, హైదరాబాద్, మలేషియా, యుకె, యుఎఈ, సింగపూర్ నుండి 2,500 మంది భారతీయులు బెంగళూరు చేరుకుంటారు.

విమాన ప్రణాళిక యొక్క చివరి రోజైన 7వ రోజు.. సుమారు 1,850 మంది భారతీయులు కువైట్, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, యుఎస్ఎ నుండి కోజికోడ్, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ చేరుకుంటారు.

అయితే విమానం ఎక్కే ముందు ప్రతి ఒక్క ప్రయాణికుడికి మెడికల్ స్క్రీనింగ్ జరుగుతుంది. వైరస్ లక్షణాలు లేని ప్రయాణీకులను మాత్రమే ఫ్లైట్ ఎక్కడానికి అనుమతిస్తారు. ప్రయాణ సమయంలో ప్రయాణీకులందరూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన హెల్త్ ప్రోటోకాల్‌తో పాటు పౌర విమాన యాన మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రోటోకాల్‌ను అనుసరించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ సెల్ ఫోన్‌లో ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రయాణీకులు వారి వారి స్వస్థలాలకు చేరుకున్నాక 14 రోజులు గృహ నిర్భంధంలో ఉండాలి. 14 రోజుల అనంతరం మళ్లీ కోవిడ్ పరీక్ష చేస్తారు. దానిని అనుసరించి తదుపరి చర్యలు ఉంటాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story