జర్మనీలో కొత్తగా 679 కేసులు.. అక్కడ పది రెట్లు ఎక్కువట!

జర్మనీలో కొత్తగా 679 కేసులు.. అక్కడ పది రెట్లు ఎక్కువట!

జర్మనీలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తూనే ఉంది. అక్కడ 24 గంటల్లో 679 కొత్త కేసులు నమోదయ్యాయి, ఇది మార్చి 12 నుండి అతి తక్కువ సంఖ్య. అదే సమయంలో, ఆదివారం , సోమవారం మధ్య 43 మరణాలు సంభవించాయి, ఇది మార్చి 25 నుండి అతి తక్కువ. ఇప్పటివరకు దేశంలో సోకిన వారి సంఖ్య 1 లక్ష 63 వేల 175 కు చేరుకోగా, 6692 మంది మరణించారు. అదే సమయంలో 1 లక్ష 32 వేల 700 మంది రోగులు కోలుకోవడంతో ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఇదిలావుంటే బాన్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల ప్రకారం, జర్మనీలో వ్యాధి సోకిన వారి సంఖ్య 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. మరోవైపు కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నా లాక్‌డౌన్‌ను బుధవారం నుంచి సడలించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story