జేఈఈ, నీట్ పరీక్షా తేదీలు ప్రకటించిన కేంద్ర మంత్రి

జేఈఈ, నీట్ పరీక్షా తేదీలు ప్రకటించిన కేంద్ర మంత్రి
X

కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఐఐటీ జేఈఈ, నీట్ పరీక్షా షెడ్యూల్ ను విడుదల చేశారు. జేఈఈ మెయిన్ పరీక్షలు జులై 18 నుంచి 23 వరకూ జరుగుతాయని.. అడ్వాన్స్‌ పరీక్షలు ఆగస్ట్‌లో నిర్వహిస్తామని తెలిపారు.ఇక, నీట్ ఎగ్జామ్ జులై 26న జరిపిస్తామని అన్నారు. అటు, కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సీబీఎస్‌ఈ పరీక్షలతో పాటు పది, పన్నెండో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్‌పై నిర్ణయం తీసుకోలేకపోయామని.. త్వరలోనే వాటిపై కూడా నిర్ణయం తీసుకొని తేదీలు ప్రకటిస్తామని రమేశ్ పోఖ్రియాల్ అన్నారు.

Next Story

RELATED STORIES