ఉదయం 10 నుంచి సాయింత్రం 5 వరకు మీ ఇష్టం.. ఎంత కావాలంటే అంత

ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం సమకూర్చేది మద్యం. మందు తాగపోతే నిద్ర పట్టి చావని పరిస్థితి సామాన్యుడిది. లాక్డౌన్ పేరుతో మద్యం దుకాణాలు కూడా మూసేస్తే ఎలా బతకాలి. కరోనా వచ్చి పోవటమేమో కానీ మద్యం ముట్టకపోతే మా కష్టం మేష్టారు అని ప్రభుత్వానికి విన్న వించుకున్నారు మందు బాబులు. దాంతో దాదాపుగా రాష్ట్రప్రభుత్వాలన్నీ దిగి వచ్చి దుకాణం ఓపెన్ చేసుకోమంటున్నాయి. తాజాగా తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నా మద్యం అమ్మకాలు మే 7 నుంచి ప్రారంభించవచ్చని తెలిపింది.
అయితే అన్ని మద్యం దుకాణాలకు అనుమతి లేదని, కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న లిక్కర్ రిటైల్ దుకాణాలు మాత్రమే తెరిచేందుకు వీలు కల్పించామని పళనిస్వామి ప్రభుత్వం స్పష్టం చేసింది. మే 7 నుంచి తెరుచుకోనున్న దుకాణాలు సమయ పాలనతో పాటు సామాజిక దూరాన్ని కచ్చితంగా పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేసింది. ఇక మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి సాయింత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటాయని ప్రకటించింది. కంటైన్మెంట్ జోన్లకు మాత్రం అనుమతి లేదని తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com