మద్యం కోసం మగువలు క్యూలో.. ఆర్జీవీకి దొరికేశారు

మద్యం కోసం మగువలు క్యూలో.. ఆర్జీవీకి దొరికేశారు
X

లాక్డౌన్ నిబంధనలు సడలించి మద్యం అమ్మకాలకు డోర్లు బార్లా తెరిచింది సర్కారు. దాంతో మందు బాబులతో పాటు మందు భామలు కూడా క్యూ కట్టేశారు. మహిళలు మగవారితో సమానం.. అంటూ అమ్మాయిలూ అదే క్యూలో నిల్చున్నారు. మద్యం బాటిల్ మాకు కావాలంటూ మగవారితో పోటీ పడుతున్నారు. వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ కంట పడింది ఈ వార్త. అంతే తన కత్తిలాంటి కలానికి పని చెప్పారు. చూడండి క్యూలో ఎవరున్నారో. మహిళల్ని తాగుబోతు మగాళ్ళ నుంచి కాపాడాలంటారు కానీ.. అమ్మాయిలు క్యూలో నిలబడి ఎలా మద్యం కొంటున్నారో అని ట్వీట్ చేశారు. దీనిపై సింగర్ సోనా మోహపాత్ర మండిపడ్డారు. ఆర్జీవీ ట్వీట్‌లో సెక్సిజం తప్ప మరేంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు కూడా మగవారిలాగే మద్యం కొనుక్కునే హక్కుంది. కానీ మందు తాగి క్రూరమైన పనులు చేసే హక్కు మాత్రం ఎవరికీ లేదు అంటూ బదులిచ్చారు.

Next Story

RELATED STORIES