త్వ‌ర‌లోనే ఎస్ఎస్ఎల్‌సీ ప‌రీక్ష‌లు : విద్యాశాఖ మంత్రి

త్వ‌ర‌లోనే ఎస్ఎస్ఎల్‌సీ ప‌రీక్ష‌లు : విద్యాశాఖ మంత్రి
X

క‌ర్ణాట‌క‌లో ఎస్ఎస్‌ఎల్‌సీ ప‌రీక్ష‌లు వీలైనంత త్వ‌ర‌లో నిర్వ‌హిస్తామ‌ని క‌ర్ణాట‌క విద్యాశాఖ మంత్రి ఎస్ సురేశ్ కుమార్ తెలిపారు. ఎస్ఎస్ ఎల్‌సీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు సిద్దంగా ఉండాల‌ని విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టలంద‌రికీ ఆదేశాలు జారీచేశామ‌ని సురేశ్ కుమార్ వివరించారు. శానిటైజ‌ర్లు, మాస్కులు, స్క్రీనింగ్ సౌక‌ర్యాలు ప‌రీక్షా కేంద్రాల వ‌ద్ద ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌కు సూచ‌న‌లు జారీచేసిన‌ట్లు పేర్కొన్నారు.

కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటి వరకు 651 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు సురక్షితంగా పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సురేష్ కుమార్ వివరించారు. పరీక్షల నిర్వహణపై నిబంధనలు రూపొందిస్తున్నామని ఆయన వివరించారు.

Next Story

RELATED STORIES