అమెరికన్ చిన్నారుల్లో అంతుచిక్కని అనారోగ్యం..

అమెరికన్ చిన్నారుల్లో అంతుచిక్కని అనారోగ్యం..

అసలే కరోనా ధాటికి తట్టుకోలేక కకావికలమవుతున్న అమెరికాను మరొక మహమ్మారి పట్టి పీడిస్తోంది. ఏప్రిల్ 17 తరువాత నుంచి దాదాపు 15 మంది చిన్నారులు జ్వరం, దద్దుర్లు, కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలతో హస్పిటల్స్‌లో జాయినవుతున్నారు. ముందు ఇవి కోవిడ్ అని అనుకున్నా అది కాదు మరేదో జబ్బు వీరిని పట్టి పీడిస్తోందని వైద్యాధికారులు భావిస్తున్నారు. అయితే వీరిలో చాలా మంది చిన్నారులు కోవిడ్ బారిన పడి కోలుకున్నవారే. మిస్టీరియస్ సిండ్రోమ్‌గా భావించపడుతున్న ఈ వ్యాధి గురించి వైద్యులు ఒక అంచనాకు రాలేకపోతున్నారు. పలు ఐరోపా దేశాల్లోనూ ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి. 2 నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలు ఈ వ్యాధి బారినపడుతున్నారని, వైద్యులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, స్విట్జర్లాండ్, బెల్జియంలలోని చిన్నారులు కూడా ఇలాంటి వ్యాధితోనే బాధపడుతూ వైద్యులను ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ వ్యాధిని కరోనా సంబంధం ఉన్న వ్యాధిగా నిర్ధారించలేమని వైద్యులు అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story