రాహుల్ ట్వీట్ పై సోనియా సమాధానం చెప్పాలి: బీజేపీ

రాహుల్ ట్వీట్ పై సోనియా సమాధానం చెప్పాలి: బీజేపీ
X

ఓ ముగ్గురు ఫొటోగ్రాఫర్లను అభినందిస్తూ.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విదేశీ ఏజెన్సీలకు పనిచేసే ముగ్గురు ఫొటోగ్రాఫర్ల డార్ యాసిన్, ముఖ్తార్ ఖాన్, చన్ని ఆనంద్ లకు పులిట్జర్ అవార్డ్ దక్కింది. అమెరికా పురస్కారమైన పులిట్జర్ వార్తాపత్రికలు, ఆన్‌లైను పత్రికారచన, సాహిత్యం, సంగీత స్వర రచన రంగాలలో విశేష కృషి చేసినవారికి ప్రధానం చేస్తారు. ఈ అవార్డును దక్కించుకున్న ముగ్గురిని అభినందిస్తూ.. రాహుల్ ట్విట్ చేశారు.

అయితే, జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసిన సందర్భంలో ఈ ఫొటోగ్రాఫర్లు భారతదేశాన్ని కించపరిచేలా ఫొటోలు తీసి ప్రచురించారని బీజేపీ ఆరోపిస్తోంది. వారు ప్రచురించిన ఫోటోలు సైనికులకి వ్యతిరేకముగా ఉన్నాయని ఆరోపించారు. కశ్మీర్ భారత్‌లో భాగం కాదనే వారిని రాహుల్ అభినందించడంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమాధానం చెప్పాలని సంబిత్ డిమాండ్ చేశారు.

Next Story

RELATED STORIES