జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్‌.. ఉగ్ర‌వాది హ‌తం

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్‌.. ఉగ్ర‌వాది హ‌తం
X

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతాబలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ ఉగ్ర‌వాది హతమయ్యాడు. అవంతిపోరాలో ష‌ర్షాలీ ఖ్రోవ్ ప్రాంతంలో స్థానిక పోలీసులు, భ‌ద్ర‌తా బ‌ల‌గాలు క‌లిసి ఆప‌రేష‌న్ నిర్వ‌హిస్తున్నాయి. భ‌ద్ర‌తా బ‌ల‌గాలు జ‌రిపిన కాల్పుల్లో ఉగ్ర‌వాది హ‌త‌మ‌య్యాడు.

ఉగ్ర‌వాదులు దాగి ఉన్నార‌న్న స‌మాచారంతో మంగళవారం సాయంత్రం భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని కార్డెన్ స‌ర్చ్ నిర్వ‌హించాయి. దీంతో ఒక ఇంటి నుంచి కాల్పులు ప్రారంభం కావ‌డంతో బ‌ల‌గాలు ఎదురుకాల్పులు జ‌రిపాయి. రాత్రి చీక‌టి కార‌ణంగా స్థానిక పౌరుల‌కు హాని జ‌రుగుతుంద‌ని బ‌ల‌గాలు కాల్పులు ఆపివేసి ఆ ప్రాంతం మొత్తం చుట్టుముట్టాయి. బుధవారం ఉద‌యం మ‌ళ్లీ అదే ఇంటి నుంచి కాల్పులు జ‌ర‌గ‌డంతో భ‌ద్ర‌తాబ‌ల‌గాలు ఎదురుకాల్పులు జ‌రిపాయి. ఈ ఘటనలో ఓ ఉగ్ర‌వాది మృతి చెందాడు.

Next Story

RELATED STORIES